నక్సల్స్ దాడి: మరొకరి మృతి, జానా పరిశీలన
ఒంగోలు/ గుంటూరు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్ణణంలో జరిగిన దాడిలో గాయపడినవారిలో ఒకరు మృతి చెందారు. ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ మహేష్‌చంద్ర లడ్హా వాహనంపై బుధవారం మధ్యాహ్నం మావోయిస్టులు క్లేమోర్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, తొమ్మిది మంది గాయడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో సత్యం అనే విద్యార్థి మరణించాడు.
హోంమంత్రి కె. జానారెడ్డి గురువారం ఉదయం ఒంగోలులోని సంఘటనాస్థలాన్ని సందర్శించారు. తనపై దాడి జరిగిన తీరు యస్పీ లడ్హా హోం మంత్రి కె. జానారెడ్డికి సంఘటనాస్థలంలో వివరించారు. జానారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. నక్సల్స్‌పై నిషేధం విధించే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు జానారెడ్డి చెప్పారు. ఆయుధాలు వదిలిపెట్టి వస్తే చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. నక్సల్స్‌పై నిషేధం విధించే విషయంలో మేధావుల అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అవగాహనాలోపం వల్లనే నక్సల్స్ ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
సంఘటనాస్థలంలో మరణించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు. అతని శరీరం తునాతునకలై చెల్లాచెదురు కావడంతో గుర్తించడం ఇబ్బందిగా ఉంది.












Click it and Unblock the Notifications