ఆంధ్ర ప్రాజెక్టులపై ప్రధానికి కర్ణాటక ఫిర్యాదు
న్యూఢిల్లీ: కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి ధరంసింగ్ నేతృత్వంలోని అఖిల పక్ష ప్రతినిధి బృందం గురువారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీ జలాలను అక్రమంగా వాడుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని అంటూ వాటిని అడ్డుకోవాలని ఆ బృందం ప్రధానిని కోరింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 సాగునీటి ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని ఆ బృందం ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యల వల్ల తమకు రావాల్సిన నీటి అందడం లేదని ఆ బృందం చెప్పింది. దీనిపై పరిశీలిస్తామని ప్రధాని కర్ణాటక బృందానికి హామీ ఇచ్చింది. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులతో కూడిన 62 మంది ప్రతినిధుల బృందం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసింది. కృష్ణా జలాల వాటా తేలకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపడుతోందని, మొత్తం 21 ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోందని ముఖ్యమంత్రి ధరంసింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications