కెసిఆర్ గైర్హాజరీపై రాజ్యసభలో ప్రధాని క్షమాపణ
న్యూఢిల్లీ: కార్మిక శాఖ మంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజ్యసభలో లేనందుకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ క్షమాపణ చెప్పారు. సమాధానాలు ఇవ్వాల్సిన సమయంలో చంద్రశేఖర్ రావు సభకు గైర్హాజర్ కావడాన్ని ఆయన విమర్శించారు. తమ శాఖల పట్ల మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూస్తానని ఆయన రాజ్యసభ చైర్మన్ బైరాన్ సింగ్ షెకావత్‌కు హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాలుగవ వార్షికోత్సవంలో పాల్గొనడానికి మంగళవారం రాత్రి చంద్రశేఖర్ రావు హైదరాబాద్ వెళ్లారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో పార్టీ నాలుగవ వార్షికోత్సవంలో మాట్లాడారు. వెంటనే ఆయన ఢిల్లీ తిరిగి రాలేదు. మే 2వ తేదీ వరకు చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌లోనే ఉంటారని సమాచారం.












Click it and Unblock the Notifications