పిసిసి అధ్యక్షుడిగా మళ్లీ కేశవరావు ఎన్నిక
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా డాక్టర్ కె. కేశవరావు ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పిసిసి అధ్యక్ష పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశవరావు ఎన్నికను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రకటిస్తారు.
కేశవరావు తన నామినేషన్‌ను గురువారం రిటర్నింగ్ అధికారులు దల్జీత్‌సింగ్, బసవరాజ్‌లకు అందజేశారు. కేశవరావు అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో పాటు మంత్రులు కె. రోశయ్య, ఎం. సత్యనారాయణ రావు, డి. శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి ప్రతిపాదించారు. కేశవరావును పలువురు నాయకులు అభినందించారు. తనపై పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కేశవరావు అన్నారు.












Click it and Unblock the Notifications