యస్పీపై దాడి చేసింది మేమే: మావోయిస్టు నేత
ఒంగోలు: ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) మహేశ్ చంద్ర లడ్డాపై దాడి చేసింది తామేనని మావోయిస్టు నల్లమల ఏరియా కార్యదర్శి సుదర్శన్ ప్రకటించారు. ఈ మేరకు సుదర్శన్ పేర ఒక ప్రకటన విడుదలైంది. చిన్న సాంకేతిక లోపం వల్ల యస్పీ బతికి బయటపడ్డారని, అయితే యస్పీని తాము వదలబోమని ఆయన అన్నారు.
నాలుగు నెలల్లో యస్పీ మహేష్‌చంద్ర లడ్హా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఈ దాడికి ప్రతీకారంగా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగితే ఇదే పద్ధతిలో సమాధానం చెప్తామని ఆయన అన్నారు. తమ టార్గెట్‌లో ఇద్దరు డియప్సీలు, ఒక కానిస్టేబుల్ ఉన్నారని ఆయన చెప్పారు. దాడిలో నష్టపోయిన ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పారు.












Click it and Unblock the Notifications