ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
ఒంగోలు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వారిలో ముగ్గురు మరణించగా, ఒక బాలిక బతికి ఉంది. అనార్యోగ కారణంతో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. వేరే గ్రామంలో టీచర్‌గా పని చేస్తున్న రాధాకృష్ణమూర్తి సెలవులతో ఇంటికి వచ్చారు. బుధవారంనాడు బుచ్చిరెడ్డిపాలెం అనే గ్రామానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులు తిరిగి వచ్చారు. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో భోజనాలు చేసి తొమ్మిది గంటలకు పడుకున్నారు. దీంతో ఎవరూ వారిని అనుమానించలేదు.
మర్నాడు గురువారం ఉదయం పక్కింటావిడ వచ్చి చూస్తే ఇంటి గొళ్లెం బయటి నుంచి పెట్టి ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. ఫ్యాన్ తిరుగుతోంది. గాలించగా ముగ్గురు శవాలు బావిలో కనిపించాయి. ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో పడి ఉంది. అమ్మాయి రాయిపై పడటం వల్ల బతికిందని రెవెన్యూ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications