కాకినాడ వద్ద ఎగిసి పడుతున్న సముద్రం అలలు
కాకినాడ: కాకినాడ వద్ద సముద్రం అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. దీనికి కారణాలేమిటో తెలియడం లేదు. కాకినాడ సమీపంలోని ఉప్పాడ, సుబ్బంపేట, కొత్తపట్నం గ్రామాల్లోకి సముద్రం నీరు చొచ్చుకొని వస్తోంది. సముద్రంలో బీభత్సం ఏదీ లేదని, కాకినాడ వద్ద స్థానిక ఘటనలైవైనా ఇందుకు కారణం కావచ్చునని ఎన్‌జిఆర్‌ఐ అంటోంది. సాధారణ స్థాయి కంటే ఏడెనిమిది అడుగులు ఎక్కువగా కెరటాలు లేచి పడుతున్నాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. సుబ్బంపేట గ్రామస్థులు ఊరును ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ అధికారులు వచ్చి పరిస్థితిని పరిశీలించి చర్యలేవీ చేపట్టడకుండానే తిరిగి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications