ఎసిబికి చిక్కిన గిరిజన శాఖ అధికారి
విశాఖపట్నం: లంచం తీసుకుంటూ గిరిజన శాఖ ఇన్వెస్టిగేటర్ రవీంద్ర అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) అధికారులకు పట్టుబడ్డారు. షెడ్యూల్ తెగల సర్టిఫికెట్లు ఇవ్వడానికి రవీంద్ర 50 వేల రూపాయలు డిమాండ్ చేసి ఒక మహిళ నుంచి ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు.
తన కొడుకులు ఇద్దరికి ఎస్‌టి సర్టిఫికెట్స్ కావాలని హేమలత అనే మహిళ రవీంద్ర వద్దకు వెళ్లింది. అయితే అతను యాబై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అమె అంగీకరించి, విషయాన్ని ఎసిబి అధికారులకు తెలియజేసింది. ఈ విషయం తెలియని రవీంద్ర హేమలత వద్ద నుంచి యాబై వేల రూపాయలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications