మెదక్ జిల్లాలో ప్రమాదం: నలుగురు మృతి
సంగారెడ్డి: మెదక్ జిల్లా జిన్నారం మండలం దొమ్మడుగు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గుమ్మిడిదల గ్రామానికి చెందిన వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. టాటా సుమో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పల్టీలు కొట్టింది. మరణించినవారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.












Click it and Unblock the Notifications