14న పునరంకిత దినం: మంత్రివర్గ నిర్ణయం
హైదరాబాద్: తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఈ నెల 14వ తేదీని పునరంకిత దినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రజాపథం కార్యక్రమంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమాన్ని సమీక్షించారు.
రాష్ట్రంలో 3 వేల హోంగార్డులను నియమించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఇంత పెద్దయెత్తున హోంగార్డుల నియామకం జరపాలని నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. ఉన్నత విద్యామండలికి రెండో చైర్మన్‌ను నియమించడానికి వీలుగా సంబంధిత చట్టాన్ని సవరించాలని సమావేశం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్నత విద్యామండలికి ఒక్కరే చైర్మన్ ఉన్నారు. ఆబ్కారీ విధానానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications