ఆయుధంతో అభివృద్ధి అసాధ్యం: కెకె
మెదక్: ఆయుధంతో అభివృద్ధి సాధ్యం కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన తన రెండో విడత శాంతి సందేశ్ యాత్రను సోమవారంనాడు మెదక్ జిల్లా కొండపాక గ్రామం నుంచి ప్రారంభించారు. తాము ఏ యాత్ర చేపట్టినా ప్రజల సమస్యల పరిష్కారానికేనని ఆయన అన్నారు.
కులాలు, మతాలు, రాజకీయాల పేరిట రక్తపాతం సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు దండలు వేస్తే సరిపోదని, వారు చూపిన శాంతి మార్గంలో నడవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications