ఇటలీ శిక్షణకు సానియా: ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఒకె

హైదరాబాద్‌: శిక్షణ పొందేందుకు టెన్సిస్‌ తార సానియా మీర్జా ఇటలీ బయలుదేరి వెళ్తున్నారు. విదేశీ కోచ్‌ల వద్ద సానియా శిక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో 15 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి సానియాకు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్‌మంటన్‌ ఆటగాడు పుల్లెల గోపీచంద్‌కు ముఖ్యమంత్రి 10 లక్షల రూపాయలు అందజేశారు. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్‌మెంటన్‌ ఎక్స్‌లెషన్స్‌ సెంటర్‌లో విదేశీ కోచ్‌ను నియమించేందుకు ఆ పది లక్షల రూపాయలు అందించారు.

విదేశీ శిక్షణ పొంది సానియా టెన్నిస్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. తాను ఫ్రెంచ్‌ ఓపెనలో పాల్గొంటున్నట్లు సానియా విలేకరులతో చెప్పారు. 2007 అక్టోబర్‌లో జరిగే ప్రపంచ మిలటరీ క్రీడలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి ఎయిర్‌ మార్షల్‌తో సమావేశమై ఆ విషయం చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+