రెండు జిల్లాల్లో 6గురు నక్సలైట్ల లొంగుబాటు
హైదరాబాద్: రెండు జిల్లాల్లో సోమవారంనాడు ఆరుగురు నక్సలైట్లు లొంగిపోయారు. వరంగల్ జిల్లాలో మావోయిస్టు భూపాలపల్లి డిప్యూటీ దళ కమాండర్‌తో పాటు మరో నలుగురు జనశక్తి నక్సలైట్లు లొంగిపోయారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్‌పి) త్రిపాఠీ ముందు చత్తీస్‌ఘడ్‌కు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఆరవ ప్లాటూన్ డిప్యూటీ దళ కమాండర్ శివన్న అలియాస్ సంజీవ్ లొంగిపోయాడు. విప్లవ గేయాలకు ఆకర్షితుడై తాను నక్సలైట్లలో కలిసినట్లు శివన్న తెలిపాడు.
వరంగల్ జిల్లాలో నక్సలైట్లు ఆత్మకూర్ మండలం పెద్దాపూర్‌లో పోలీసుల ముందు లొంగిపోయారు. వ్యక్తిగత సమస్యలతోనే నక్సలైట్లలో కలిశామని ఎక్కువ మంది చెప్పారు. నక్సలైట్లు లొంగిపోవాలనుకుంటే హోం గార్డ్స్ చెంతనైనా లొంగిపోవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నలుగురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications