మెట్టు దిగిన పాశ్వాన్: సోనియాతో భేటీ
న్యూఢిల్లీ: బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో లోక్‌జనశక్తి నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ మెట్టు దిగి వచ్చారు. రాష్ట్రీయ జనతాదళ్‌పై తమ వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే కాంగ్రెస్ ముస్లిం నాయకుడ్ని బీహార్ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలని పాశ్వాన్ గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
బీహార్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము మద్దతు ఇస్తామని, అందులో ఆర్జేడీ పాలు పంచుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అయితే ముస్లిం నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే షరతు మాత్రం ఉంటుందని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయాన్ని తెలియజేయడానికి పాశ్వాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.












Click it and Unblock the Notifications
