అరెస్టులు: విజయనగరం కలెక్టరేట్ ముట్టడి భగ్నం
విజయనగరం: తోటపల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. తోటపల్లి నిర్వాసితులతో కలిసి సిపియం శుక్రవారం కలెక్టరేట్ ముట్టడిని చేపట్టింది. కలెక్టరేట్‌కు వెళ్లే నాలుగు జంక్షన్‌లలో పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. కలెక్టరేట్‌కు చేరుకోక ముందే పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. సిపియం నాగూరు శాసనసభ్యడు లక్ష్మణమూర్తితో పాటు సిపియం కార్యకర్తలను, తోటపల్లి నిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను మూడు వ్యాన్‌లలో పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన తర్వాత తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని సిపియం డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications
