సంయమనం పాటించండి: చంద్రబాబు విజ్ఞప్తి

హైదరాబాద్‌: సంయమనం పాటించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. పెనుకొండలో ఏం జరిగిందేనే కచ్చితమైన సమాచారం అందితే తప్ప ఆ సంఘటనపై తాను మాట్లాడలేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అక్కడి సంఘటనలు పార్టీ సమీక్షిస్తుందని ఆయన చెప్పారు.

ప్రభుత్వ ఆస్తులకు గానీ, ప్రైవేట్‌ ఆస్తులకు గానీ నష్టం కలిగించవద్దని ఆయన కోరారు. మొదట పెనుకొండలో సాధారణ పరిస్థితి నెలకొనాల్సింది ఉందని, ఆ తర్వాత ఏం జరిగిందనేది సమీక్షించుకోవచ్చునని ఆయన అన్నారు. ఆవేశాలకు లోను కావద్దని, తొందరపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+