ఇందిరకు, నక్సలైట్లకు తేడా లేదు: ఎమ్మెసార్
వరంగల్: నక్సలైటుకు, ఇందిరా గాంధీకి తేడా లేదని దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. ఉన్న తేడా అల్లా ఆయుధాలేనని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఇందిరా గాంధీ లాగానే నక్సలైట్లు కూడా పేదల కోసమే పాటు పడుతున్నారని ఆయన అన్నారు. నక్సలైట్లకు ఆయుధాలు మచ్చలాంటివని ఆయన అన్నారు. భూమి లేని పేదలకు భూమి ఇవ్వాలని, దున్నేవాడికే భూమి అనే నినాదాల విషయంలో ఇందిరాగాంధీకి, నక్సలైట్లకు తేడా లేకపోవడాన్ని చూడవచ్చునని ఆయన అన్నారు.
నక్సలైట్లు అమాయకులను హతమారుస్తున్నారని ఆయన ఇటీవల దాడి చేశారు. అంతకు ముందు తాను నక్సలైట్ల సానుభూతిపరుడినని చెప్పుకున్నారు. నక్సలైట్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం సత్యనారాయణరావుకు అలవాటుగా మారింది.












Click it and Unblock the Notifications
