సమిష్టి కృషితోనే జలయజ్ఞం సఫలం: వైయస్
హైదరాబాద్: అధికారులు, మంత్రులు సమిష్టిగా కృషి చేస్తేనే జల యజ్ఞం విజయవంతమవుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని జూబిలీహాల్‌లో జరిగిన పునరంకిత ప్రమాణోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఏడాది కాలంగా ఒక జట్టుగా పని చేసి చేతనైన మేరకు సుపరిపాలనను అందించడానికి ప్రయత్నించామని ఆయన చెప్పుకున్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలంటే వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వకతప్పదని, ఈ దిశగానే ప్రభుత్వం పని చేస్తోందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం పరిశ్రమలకు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. సుపరిపాలనను అందించడానికి కృషి చేస్తూ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దే దిశలో సాగుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
