వెంకటస్వామిని అడ్డుకోవడం భ్రూణహత్య: బిజెపి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పునరంకిత సభలో తెలంగాణపై మాట్లాడడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామిని అడ్డుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు తీవ్రంగా తప్పు పట్టారు. తెలంగాణపై మాట్లాడబోయిన వెంకటస్వామిని ఐ ఎయస్ అధికారి రమణాచారి అడ్డుకోవడం భ్రూణహత్య లాంటిదేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు పునరంకిత సభలో ప్రత్యేక తెలంగాణ గురించి ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. టి ఆర్‌యస్ మంత్రులు తెలంగాణ గురించి ప్రస్తావించకపోవడం వంచన కిందికే వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడబోయిన వెంకటస్వామిని అడ్డుకోవడం ద్వారా వైయస్ ప్రభుత్వం ఫ్యాక్షనిజాన్ని ప్రకటించుకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
