యుపిఎ, యన్‌డిఎలకు తేడా లేదు: మాయావతి
న్యూఢిల్లీ: తన ఆస్తులపై సిబి ఐ విచారణ జరపడంపై తీవ్రంగా ఆగ్రహించిన బహుజన సమాజ్ పార్టీ (బియస్‌పి) నాయకురాలు మాయావతి ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డిఎ)ను కూడా ఆమె వదిలిపెట్టలేదు.
యన్‌డి ఎకు, యుపి ఎకు మధ్య ఏ విధమైన తేడా లేదని, రెండు కూడా మనువాద కూటములేనని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. యన్‌డిఎను నాగనాథ్‌గా, యుపిఎను శాపనాథ్‌గా ఆమె అభివర్ణించారు. అయితే రెంటి మధ్య తేడా అల్లా నాగనాథ్ కాటు వేస్తే మనిషి వెంటనే చనిపోతాడని, శాపనాథ్ కాటు వేస్తే మరణం నెమ్మదిగా సంభవిస్తుందని ఆమె అన్నారు. యుపి ఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయాన్ని అవసరమైతే పునఃపరిశీలించుకుంటామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
