73 మంది ఐఎయస్‌ల బదిలీ: ఢిల్లీలో సియం
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐ ఎయస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 73 మంది ఐ ఎయస్ అధికారులను బదిలీ చేసి పాలనాయంత్రాంగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. బదిలీ అయినవారిలో 9 మంది జిల్లా కలెక్టర్లు ఉన్నారు.
ఇదిలా వుంటే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. ఏడాది పాలన గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి వివరించేందుకు, వచ్చే నాలుగేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వచ్చారు. రాష్ట్రానికి చెందిన వివిధ సమస్యలను ఆయన కేంద్ర మంత్రులకు వివరిస్తారు. ఈ నెల 22వ తేదీన సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు, ఈ సమావేశంలో కేంద్ర పరిశీలకులు పాల్గొననున్నట్లు రాజశేఖర్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు.












Click it and Unblock the Notifications
