వరంగల్‌ జిల్లాలో నక్సల్స్‌ దంపతుల అరెస్టు

హైదరాబాద్‌: సిపియుయస్‌ఐ నక్సలైట్‌ దంపతులను వరంగల్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ జిల్లా జనగాం జోనల్‌ కమిటీ నాయకుడు నవీన్‌, ఆయన సహచరి రాధికను పోలీసులు కాజీపేట వద్ద బస్సులో వెళ్తుండగా అరెస్టు చేశారు. వారిని మడికొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నవీన్‌, రాధికలకు హాని జరిగితే పోలీసులే బాధ్యత వహించాలని సిపియుయస్‌ఐ చర్చల ప్రతినిధి శ్రీహరి అన్నారు.

నవీన్‌, రాధికలను ఎన్‌కౌంటర్‌ చేసే ప్రమాదం ఉన్నదని మావోయిస్టుల మాజీ ప్రతినిధి వరవరరావు అన్నారు. నవీన్‌, రాధికలను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై తాను హోం మంత్రి కె. జానారెడ్డికి తెలియజేశానని, ఇదే విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. నవీన్‌, రాధికలపై కేసులు కూడా ఉండే అవకాశం లేదని, అందువల్ల వారిని విడుదల చేయాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+