పెనుకొండ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ: సిపిఐ
కరీంనగర్: అనంతపురం జిల్లా పెనుకొండలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీత నామినేషన్ సందర్భంగా సంభవించిన ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) జాతీయ కార్యవర్గ సభ్యుడు పువ్వాడ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణ జరుగుతుండగా ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు వెలువడ కూడదని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు.
ప్రత్యేక తెలంగాణపై ఒకటి, రెండు రోజుల్లో తమ వైఖరిని తెలియజేస్తామని ఆయన చెప్పారు. మావోయిస్టు మాజీ ప్రతినిధి వరవరరావు లేఖలు వామపక్ష ఉద్యమానికి మచ్చ తెచ్చేవిగా ఉన్నాయని, ఈ విధమైన లేఖలు గందరగోళం సృష్టిస్తాయని ఆయన అన్నారు. ఇటువంటి లేఖల వ్యవహారం తెలంగాణ సాయుధపోరాట కాలం నుంచే ఉందని ఆయన అన్నారు. చర్చలపై నమ్మకం ఉంటే మావోయిస్టులు ఆయుధాలు వదిలి రావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
