డిల్లీలో వైయస్ బిజీ: సోనియాతో భేటీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సోమవారం ఢిల్లీలో బిజీగా గడిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన రాష్ట్రంలో ఏడాది పాలనపై తన సమీక్షను తెలియజేశారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులతో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి మంత్రివర్గ విస్తరణపై, ప్రభుత్వ భవిష్యత్తు కార్యక్రమాలపై వివరించారు. కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలను రాష్ట్రంలో నిర్వహించాలని సిడబ్ల్యుసి సమావేశంలో ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏడాది పాలనపై సోనియా గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరాను కూడా వైయస్ కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications
