పెనుకొండలో ప్రచారానికి తెర
అనంతపురం: పెనుకొండ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెర పడింది. తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్యకు గురి కావడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిటాల రవి సతీమణి పరిటాల సునీత పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బోయ శ్రీరాములు పోటీలో ఉన్నారు.
నామినేషన్ల పర్వం నుంచే పెనుకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సునీత నామినేషన్ వేసే రోజున తీవ్ర ఘర్షణ జరిగి పోలీసులు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించారు. ఈ సంఘటనపై తెలుగుదేశం, కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. రాష్ట్ర మంత్రులు జె.సి. దివాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డి పెనుకొండ ఎన్నికల ప్రచారంలో చరుకుగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రచారానికి దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications
