విశాఖ ఉక్కును సెయిల్‌కు ఇవ్వం: సిఎం
హైదరాబాద్: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉండగా తీసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదని ఇప్పుడు లాభాల్లో ఉండగా విలీనం చేసుకుంటామంటున్నారని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు సెయిల్ పరిధిలోకి వెళ్తే బీహారీలు ఆధిపత్యం చెలాయిస్తారని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు చరిత్రలో మొదటిసారిగా తెలుగు వ్యక్తి అధిపతిగా వచ్చారని, ఆయన హయాంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. తమ వాదనను విన్పించేంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాను ఢిల్లీకి పంపించినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications
