పెనుగొండలో ఓటమిని ముందే ఒప్పుకున్న కాంగ్రెస్!
హైదరాబాద్: రేపు వెలువడనున్న పెనుకొండ ఉపఎన్నిక ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ వ్యాఖ్యానించింది. ఫ్యాక్షన్ నేపధ్యం లేనివారికి టికెట్ ఇవ్వాలన్న ఆదర్శానికి కాంగ్రెస్ కట్టుబడి ఉన్నందున ఓటమి తమకు బాధ కలిగించదని చీఫ్ విప్ కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం ఇక్కడ అన్నారు. దీనితో ఫలితాలు రాకుండానే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్టయింది. ఎన్నికను తాము ప్రశాంతంగా జరిపించామని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
