జులై 18 నుంచి మన్మోహన్ అమెరికా పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్ జూలై 18న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో సమావేశమవుతారు. బుష్ ఆహ్వానం మేరకు ప్రధాని మన్మోహన్‌సింగ్ జూలై 18 నుంచి మూడు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
థాయ్‌ల్యాండ్ ప్రధాని రాక
థాయ్‌లాండ్ ప్రధాని థకసిన్ షినావత్ర ఒక రోజు పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఇ.అహ్మద్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షినావత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాలమధ్య విద్యా కార్యక్రమాల బదలాయింపుపై ఒప్పందం కుదిరింది. అనేక ఇతర రంగాలలో సహకారంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో షినావత్ర చర్చలు జరిపారు. రక్షణ, వాణి జ్యం, ఆర్థిక వ్యవస్థ, టూరిజం, విద్య, సాంస్కతిక కార్యక్రమాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు తదితర అనేక రంగాలలో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications
