వ్యవసాయమే ప్రధాన ఎజెండా: వైఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ఎజెండాగా వ్యవసాయాభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. మెదక్ జిలా ములుగు మండలంలో నూజివీడు సీడ్స్ ఏర్పాటు చేసిన సీడ్ బ్యాంకును ఆయన శుక్రవారం ఉదయం ప్రారంభించారు. రాష్ట్రమంతటా మండలానికో విత్తనబ్యాంకును, జిల్లా స్ధాయిలో విత్తన ప్రయోగశాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. నకిలీ విత్తనాలను తయారు చేసే కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం గత పదేళ్ళుగా సంక్షోభంలో పడిందని, ఏడాదిగా తాము తీసుకుంటున్నచర్యల వల్ల ఇప్పుడుడిప్పుడే కోలుకుంటోందని చెప్పారు.












Click it and Unblock the Notifications
