జనంపైకి దూసుకెళ్లిన లారీ: నలుగురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఒక లారీ బస్ స్టాపులో నించున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాదకరమైన సంఘటన జిల్లాలోని నారయణవనం మండలం ఏకండ్రిక గ్రామంలో జరిగింది. లారీ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. లారీని మలుపు తిప్పుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రించలేకపోయాడని, దీంతో అది బస్‌స్టాపులో నిలుచున్నవారిపైకి దూసుకెళ్లిందని పోలీసులంటున్నారు. గాయడినవారిని పుత్తూరు, చిత్తూరు ఆస్పత్రుల్లో చేర్చారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.












Click it and Unblock the Notifications