ఆర్టీసి కార్మికులతో చర్చలు ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి) కార్మిక నాయకులతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు ఎల్లుండికి (శుక్రవారానికి) వాయిదా పడ్డాయి. ప్రభుత్వ ఉపసంఘం సభ్యులతో ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులతో బుధవారం ఉదయం చర్చలు జరిగాయి. కార్మికుల డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఆర్థిక మంత్రి కె. రోశయ్యతో చర్చించి గానీ చెప్పలేమని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు చెప్పారు. దీంతో చర్చలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి.
మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలిసి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకుని కార్మిక సంఘాల నేతలతో చర్చలు పునఃప్రారంభించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించుకుంది. కార్మిక సంఘాలు పెట్టిన 21 డిమాండ్లలో 15 ప్రభుత్వం పరిష్కరించాల్సినవి. మిగతా ఆరు ఆర్టీసి యజమాన్యానికి సంబంధించినవి. ఈ ఆరు డిమాండ్లపై కార్మిక సంఘాల నాయకులు మంగళవారం ఆర్టీసి యాజమాన్యంతో చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications