ఆర్టీసి చర్చలు: ఎవరి దారి వారిదే
హైదరాబాద్: ఆర్టీసి చర్చల విషయంలో ఎవరి దారిన వారే నడుస్తున్నారు. ఆర్థికపరమైన ఆర్టీసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతోంది. అయితే ఎల్లుండి జరిగే చర్చల్లో తమ డిమాండ్లను అంగీకరించకపోతే వచ్చే నెల 4వ తేదీ నుంచి సమ్మె చేసి తీరుతామని ఆర్టీసి కార్మిక సంఘాలు అంటున్నారు.
డీజిల్‌పై వేసిన వాణిజ్య పన్నును తగ్గించేది లేదని మంత్రి సంతోష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసి దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కార్మికులు కూడా కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేనందున పెద్ద మొత్తంలో ఆర్థిక భారాన్ని మోసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఈ పరిస్థితిని కార్మిక సంఘాల నాయకులు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications