ముస్లింలపైచంద్రబాబు కపట ప్రేమ: మంత్రి షబ్బీర్
హైదరాబాద్: మైనారిటీలపైతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుచూపిస్తున్నది కపట ప్రేమ అని దాన్నిఎవరూ నమ్మబోరని రాష్ట్రసమాచారశాఖమంత్రిషబ్బీర్అలీ ఆన్నారు. ఆయన మంగళవారంసచివాలయంలో విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునిచంద్రబాబునాయుడుమైనారిటీల ఓట్లకోసం జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు.బీజేపీ మతతత్వ పార్టీ అని తెలిసీ ఆరేళ్ళపాటుకాపురం చేసి, ఇప్పుడు ఆ పార్టీతో తమకుసంబంధం లేదంటే ఎవరూ నమ్మరనిఆయన ఆన్నారు. గుజరాత్లో అల్లర్లు చెలరేగినప్పుడుచంద్రబాబునాయుడు అప్పటి ఎన్డీయే ప్రభుత్వాన్నిహెచ్చరించిఉంటే అక్కడి ముస్లింలపై దాడులుఆగేవని పేర్కొన్నారు. ముస్లింలకు తానుఎంతో చేశానని చంద్రబాబునాయుడుఉర్దూపత్రికల వారితోనే చెప్పడాన్ని షబీర్ ఎద్దేవాచేశారు. అదే నిజమైతే మిగతా పత్రికలవారికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
