వరంగల్ జిల్లాలో 6గురు మావోయిస్టుల అరెస్టు
వరంగల్: వరంగల్ జిల్లా పస్రా పోలీసులు ఆరుగురు మావోయిస్టు ఆత్మాహుతిదళ సభ్యులను అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్‌పై దాడికి మావోయిస్టులు వ్యూహాన్ని పన్నారని ములుగు అదనపు పోలీసు సూపరింటిండెంట్ ( ఎయస్పీ) రాజేష్‌కుమార్ చెప్పారు. అరెస్టయిన మావోయిస్టుల నుంచి 3 కప్లింగ్ బాంబులను, 5 కిట్ బ్యాగులను, 5 వైర్ బండిల్స్, 3 అమరవీరుల సిడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ ( ఆర్‌యస్‌యు)కు చెందిన ప్రసాద్ అలియాస్ పున్నంచంద్ వీరిలో ముఖ్యుడు. వీరిలో నలుగురు కొరియర్లు అని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
