చవితిలోగా మున్సిపల్ ఎన్నికలకు బిజెపి డిమాండ్
హైదరాబాద్: వినాయక చవితి పర్వదినానికి ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయని, ఈలోపలే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం మంచిదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్ 17వ తేదీలోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల నియమావళి గురించి చర్చించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోని రిజర్వేషన్లను వెల్లడించకుండా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలను దొంగదెబ్బ తీయడానికి ఎత్తు వేశారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
