సినీనటి, ఎంపి జయప్రదకు బెయిల్ మంజూరు
హైదరాబాద్: సినీనటి, సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ సభ్యురాలు జయప్రదకు నాంపల్లి కోర్టు సోమవారం బెయిల్ మంజారు చేసింది. జయప్రదపై 2003లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై హైదరాబాద్‌లోని ముషిరాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఆమె తెలుగుదేశంపార్టీలో ఉన్నారు. ఈ కేసులో ఆమె ఇంతకు ముందు కోర్టుకు హాజరు కావాల్సింది ఉంది. అయితే ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు వారంట్ జారీ చేసింది. దీంతో ఆమె సోమవారం తన న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి జయప్రద కోర్టుకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications
