నల్లగొండ జిల్లాలో ముగ్గురు నక్సల్స్ హతం
నల్లగొండ: నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం తుమ్మాయిగూడెం తండా వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మరణించిన నక్సలైట్లలో ఒకరిని రాచకొండ దళ కమాండర్, జిల్లా కమిటీ సభ్యుడు గొలనుకొండ చంద్రయ్యగా, మరొకరిని ప్రేమలత అలియాస్ మంగగా గుర్తించారు. మరొక మహిళను గుర్తించాల్సి వుంది. చంద్రయ్య నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామానికి చెందినవాడని సమాచారం. సంఘటనా స్థలం నుంచి నాలుగు గ్రెనేడ్లు, నాలుగు పిస్టళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఇతర మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
