టిఆర్‌యస్ అభ్యంతరాలపై కమిటీలు: పొన్నాల
హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) లేవనెత్తిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీలు వేస్తామని భారీ నీటిపారుదలు శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. సాగునీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షానంతరం పొన్నాల లక్ష్మయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
పులిచింతల స్థలమార్పడి, పోలవరం ముంపు సమస్య, కృష్ణా డెల్టాలకుె సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరాలపై అధ్యయనానికి మూడు నిపుణుల కమిటీలను వేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె. చంద్రశేఖర్ రావుకు మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల నిర్ణయాల మేరకు ఈ కమిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణం పనులు ఆగబోవని, అవి కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. సింగూరు నుంచి 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి 88 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
