ఆర్టీసి సమ్మె కేసులో తీర్పు రిజర్వ్
హైదరాబాద్: ఆర్టీసి సమ్మె కేసులో హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసుకుంది. ఆర్టీసి సమ్మె కేసులో సోమవారం విచారణ ముగిసింది. ఈ స్థితిలో సమ్మె నోటీసు ఇవ్వాలనే తమ నిర్ణయాన్ని ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) వాయిదా వేసుకుంది. సమావేశమై చర్చించిన తర్వాతనే భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటామని జె ఎసి నాయకుడు మహమూద్ చెప్పారు.
ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న 18 డిమాండ్లను జె ఎసి కోర్టుకు సమర్పించింది. తమ ప్రధాన డిమాండ్లలో దేన్నీ ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆర్టీసి కార్మికులు వాదిస్తున్నారు. ఆర్టీసి బకాయిలు 1350 కోట్ల రూపాయల్లో 800 కోట్ల రూపాయలు చెల్లించాలని, 15 శాతం తాత్కాలిక భృతి ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం వాటికి ఒప్పుకోవడం లేదని ఆర్టీసి కార్మిక సంఘాల తరఫు న్యాయవాది విద్యాసాగర్ చెప్పారు.












Click it and Unblock the Notifications
