మహారాష్ట్రనుంచి 300 టన్నుల ఉల్లిపాయలు
హైదరాబాద్:రాష్ట్రంలో ఉల్లిపాయల ధరనువ్యాపారులు విపరీతంగా పెంచడంతో, ధరలనునియంత్రించడానికి మహారాష్ట్రలోని నాసిక్‌నుంచి 300 టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసినట్టు రాష్ట్రపౌరసరఫరాల సంస్థతెలిపింది. దీనిని రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లతోపాటు మహిళా స్వయం సహాయక బందాల ద్వారావిక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నట్టుఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అధర్‌సిన్హాతెలిపారు. ఇప్పటికే దీనిని హైదరాబాద్,రంగారెడ్డి, రాజమండ్రి, గుంటూరు,శ్రీకాకుళం, విజయవాడ, వరంగల్, కరీంనగర్‌ల్లోని రైతు బజార్లకు తరలించామన్నారు.ఉల్లిపాయలకు డిమాండ్ ఉన్న ప్రతి చోటుకివీటిని సరఫరా చేయాలని ప్రణాళికనుసిద్ధం చేశామని చెప్పారు. కిలోఉల్లిపాయలను నాసిక్ నుంచి కొనుగోలు చేయడానికితమకు నాలుగున్నర నుంచి ఐదు రూపాయలువరకు ఖర్చు అవుతుండగా రవాణా ,హమాలీల ఖర్చులు కలిపి ఏడు రూపాయలకువీటిని మన రాష్ట్రంలో విక్రయించడానికినిర్ణయించారు. వీటిని విక్రయించే వారికికిలోకు రూపాయి చొప్పున కమీషన్ ఇస్తామని ఆయనచెప్పారు.












Click it and Unblock the Notifications
