వచ్చే నెల 5వరకు వివి, కల్యాణ్‌ల రిమాండ్
అనంతపురం/ హైదరాబాద్: అనంతపురం జిల్లా మదిగుబ్బలో కానిస్టేబుల్ షేక్‌వలీపై దాడి, హత్యాయత్నం కేసుల్లో విప్లవ రచయితలు వరవరరావు, కల్యాణరావుల జ్యుడిష్యల్ రిమాండ్‌ను అనంతపురం కోర్టు వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించింది. వరవరరావు, కల్యాణరావులను పోలీసులు సోమవారం అనంతపురం కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతపురం జైలులో చోటు లేనందున వారిరువురిని హైదరాబాద్‌లోని చంచల్‌గుడా జైలుకు తరలించాలని జైలు అధికారులు కోరారు. ఈ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో ఆ ఇద్దరు రచయితలను చంచల్‌గుడా జైలుకు తరలించారు.
మదిగుబ్బలో కానిస్టేబుల్‌పై దాడి కేసులో ఇప్పటి వరకు 15 మందిని పోలీసులు కోర్టులు హాజరు పరిచారు. మీడియాతో మాట్లాడడానికి తనకు అవకాశం ఇవ్వాలని వరవరరావు కోర్టును కోరారు. అయితే కోర్టు అందుకు అంగీకరించకుండా ఏదైనా చెప్పదలుచుకుంటే న్యాయవాదితో చెప్పించాలని కోర్టు తెలియజేసింది. అరెస్టుల విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించేలా చూడాలని తాము కోర్టును కోరినట్లు నిందితుల తరఫు న్యాయవాది హరనాథ రెడ్డి మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.
వరవరరావు, కల్యాణ్‌రావుల అరెస్టుపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఇచ్చిన నోటీసులకు పోలీసులు సోమవారం సమాధానం ఇచ్చారు. ఇదిలావుంటే, కళ్యాణ్‌రావు బెయిల్ పిటిషన్‌పై రేపటికి వాయిదా పడింది. వరవరరావు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదోపవాదాలు ముగిశాయి. దీనిపై కోర్టు తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.












Click it and Unblock the Notifications
