మావోయిస్టులపై నిషేధం ఎందుకంటే...: వైయస్
రాజమండ్రి: ఒక స్వాతంత్య్ర సమరయోధుడితో పాటు పది మంది అమాయకులను దారుణంగా కాల్చి చంపినందువల్లనే మావోయిస్టులపై నిషేధం విధించామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. విప్లవ రచయితల సంఘం (విరసం)పై నిషేధం విషయాన్ని కోర్టే తేలుస్తుందని ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన సోమవారంనాడు రాజీవ్ నగరబాట నిర్వహించారు. నక్సలైట్లను ఇంటర్వ్యూలు చేయవద్దని తాను అనలేదని ఆయన స్పష్టం చేశారు. మొద్దు శ్రీనులాంటివారిని మీడియా ఇంటర్వ్యూ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన మరోసారి ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఆయన పలు అభివృద్ధికార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాము ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కొంత మంది మహిళలు వైయస్‌ను చుట్టుముట్టి తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగారు. 20 ఎకరాల దేవాదాయ భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయని, కేసు విచారణ పూర్తి కాగానే ఆ భూములను పంచుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
