హైదరాబాద్‌లో మరో 3 ఫ్లై ఓవర్లకు శ్రీకారం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మూడు ఫ్లై ఓవర్లకు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని పంజగుట్ట, గ్రీన్‌లాండ్స్‌, నల్లగొండ చౌరస్తాల్లో ఈ ఫ్లై ఓవర్లను నిర్మిస్తారు. 33 కోట్ల రూపాయలతో తలపెట్టిన పంజగుట్ట ఫ్లై ఓవర్‌ను, 14 కోట్ల రూపాయలతో తలపెట్టిన గ్రీన్‌లాండ్స్‌ ఫ్లై ఓవర్‌ను 13 నెలల్లో పూర్తి చేస్తారు.

నల్లగొండ చౌరస్తా వద్ద తలపెట్టిన ఫ్లై ఓవర్‌ను, ఇదివరకే శంకుస్థాపన జరిగిన పాతబస్తీలోని చంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను 8 నెలల్లో పూర్తి చేస్తారు. నల్లగొండ చౌరస్తా వద్ద నిర్మించే ఫ్లై ఓవర్‌కు 10 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ముఖ్యమంత్రి శంకస్థాపన కార్యక్రమంతో బుధవారం ఉదయం ట్రాఫిక్‌ స్తంభించింది. పంజగుట్టలో ట్రాఫిక్‌ స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మూసీ నది పరిరక్షణ పథకానికి కూడా ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+