ఎమ్యెల్యే నాని అరెస్టుకు రంగం సిద్ధం
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో 144వ సెక్షన్ విధించారు. తన భూమిని ఇతరులకు పట్టా చేశారంటూ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో గుడివాడలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న రైతు శవంతో గుడివాడ తెలుగుదేశం శాసనసభ్యుడు కొడాలి నాని ఆధ్వర్యంలో మంగళవారంనాడు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా జరిగింది.
ఈ నేపథ్యంలో కొడాలి నానిపై, మరో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నానిపై ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. కాల్చి పారేస్తానంటూ తనపై పిస్టల్ గురి పెట్టిన డియస్సీపై నాని కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications
