జెసి, జగన్‌ల పాత్రపై సిబిఐని ప్రశ్నించిన కోర్టు
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డి, సూరి భార్య గంగుల భానుమతుల పాత్రపై అనంతపురం కోర్టు మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ప్రశ్నించింది. ఆ ముగ్గురిపై చార్జిషీట్ ఉందా అని కోర్టు ప్రశ్నిస్తే విచారణ జరుగుతోందని సిబిఐ సమాధానమిచ్చింది. సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నామని, అందుకని ఆలస్యమవుతోందని వివరించింది.
పరిటాల హత్య కేసులో నిందితుడైన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీనును పట్టుకోలేకపోవడంపై కోర్టు సిబిఐకి అక్షింతలు వేసింది. పరిటాల హత్య కేసులో నిందితుల జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకు పొడిగించింది.












Click it and Unblock the Notifications
