నక్సల్స్‌చే కాంట్రాక్టర్ కిడ్నాప్: అరకోటి డిమాండ్
కరీంనగర్: శ్రీరాంసాగర్ వరద కాలువ కాంట్రాక్టర్ ధీరజ్ కిడ్నాప్‌నకు గురయ్యాడు. ధీరజ్‌ను జనశక్తి నక్సలైట్లు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం జీపులో వెళ్తుండగా ముగ్గురు నక్సలైట్లు జీపును ఆపేసి కాంట్రాక్టర్‌ను, జీపు డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం నర్సాపూర్ వద్ద వీరిని జనశక్తి నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. ధీరజ్ విడుదలకు జనశక్తి నక్సలైట్లు అర కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాణభయంతో తన కుమారుడి కిడ్నాప్ విషయాన్ని ధీరజ్ తండ్రి సురేందర్ రెడ్డి గోప్యంగా ఉంచినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
