రెండు ప్రమాదాలు: ఆరుగురు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా, కడప జిల్లాలో గోడ కూలి ఇద్దరు మరణించారు. కడప జిల్లా పొద్దుటూరులో ఇంటి గోడ కూలి తండ్రీకొడుకులు మరణించారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో నానిన గోడ కూలింది. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో లారీ బోల్తా పడడంతో నలుగురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. గాయపడినవారు పాడేరు హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వారాంతపు సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ బోల్తా పడింది. అందులోని ప్రయాణికుల్లో నలుగురు వ్యాపారులు మృతి చెందారు.












Click it and Unblock the Notifications