ప్రతిఘటన కార్యదర్శితో సహా ముగ్గురు అరెస్టు
కరీంనగర్: సిపిఐ (యంయల్) ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌అలియాస్ మోహన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు దళసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని కరీంనగర్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) చౌహాన్ మంళవారంనాడు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రసాద్‌తో పాటు స్వామిరావును, భాగ్యను సోమవారం రాత్రి ఆరెస్టు చేసినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రసాద్‌కు 6 హత్యలతో, 4 కిడ్నాప్‌లతో సంబంధం ఉందని ఆయన చెప్పారు. ప్రసాద్‌పై 35 కేసులున్నట్లు ఆయన తెలిపారు. స్వామిరావు ప్రతిఘటన రాష్ట్ర కమిటీ సభ్యుడు కాగా భాగ్య మేడారం దళ కమాండర్. భాగ్య ప్రసాద్ భార్య.












Click it and Unblock the Notifications
