శాసనమండలి బిల్లు వచ్చే సమావేశాల్లో: ఆజాద్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిజానికి, శాసనమండలి పునరుద్ధరణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ప్రభుత్వం తెలియజేసింది.
వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల నాటికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పునరుద్ధరణ బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధిస్తామని, ఏకాభిప్రాయ సాధనకు తాము కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఒకటి, రెండు పార్టీలు శాసనమండలి పునరుద్ధరణను వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు. శాసనమండలి పునరుద్ధరణను తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలైన కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. శాసనమండలిని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ శాసనసభ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. వామపక్షాలతో, తెలంగాణ రాష్ట్ర సమతితో పొత్తు వల్ల టికెట్లు దక్కని తమ నాయకులను శాసనమండలి పునరుద్ధరణ పేరు చెప్పి బుజ్జగించింది.












Click it and Unblock the Notifications
