జింబాబ్వే పర్యటనకు టెండూల్కర్ దూరం
తిరువనంతపురం: జింబాబ్వేతో జరిగే టెస్టు సిరీస్‌లోభారత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ పాల్గొనడం లేదు. జింబాబ్వేలో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి జరిగే టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో సచిన్ పాల్గొనడం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి ఎస్.కె. నాయర్ చెప్పారు. టెండూల్కర్ జింబాబ్వేకు వెళ్లడం లేదని, టెండూల్కర్ స్థానంలో మహారాష్ట్ర ఓపెనర్ ధీరజ్ జాదవ్ జింబాబ్వే పర్యటనకు వెళ్తున్నాడని ఆయన చెప్పారు.
జింబాబ్వేతో సెప్టెంబర 13 నుంచి 17వ తేదీ వరకు మొదటి టెస్టు మ్యాచ్, సెప్టెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు రెండో టెస్టు మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతాయి. టెన్నిస్ ఎల్బో గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతనే తిరిగి ఆడాలని సచిన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెన్నిస్ ఎల్బో గాయానికి టెండూల్కర్ లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
